– నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటు చేస్తాం
– మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేస్తున్నాం
-ౖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై సచివాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్షలో జీఎనఎం విద్యార్థులకు తమ కెరీర్ డెవలప్‌మెంట్ కోసం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని మంత్రి దామోదర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 బీఎస్సీ నర్సింగ్ కాలేజీలను, పీజీ(ఎంఎస్సీ) నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. నర్సింగ్ కాలేజీలలో మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ పోస్టును క్రియేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కౌన్సిల్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే విద్యార్థులకు, నర్సులకు కార్యాలయ ప్రాంగణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యుల్లత, వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ సీఈ శశిధర్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




