– రెండు మృతదేహాలు వెలికితీత
– మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18. : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ఎటపాక మండలం గన్నవరం దగ్గరగా ఉన్న గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన వీరు గోదావరిలో లోతు తెలియక ఆకస్మాత్తుగా దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మరో మూడు మృతదేహాల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గన్నవరం గ్రామానికి చెందిన లక్ష్మి, భారతి, సుశీలతో పాటు బాలరాజు, రమేష్ అనే వారు గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. వీరు మునిగిపోతుండగా దగ్గరగా చూసినవారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సంఘటన స్థలానికి పోలీస్, రెవెన్యూ అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




