అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌కు వేదిక‌గా హైద‌రాబాద్‌

– ప్ర‌భుత్వ నిరంత‌ర ప్రోత్సాహం
– క్రీడా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
– ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్‌ వేదికగా మారుతోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌-2025 బ్యాడ్మింటన్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహక విధానాన్ని అమలు చేస్తోంది.. దాని ఫలితంగా హైదరాబాద్‌ మాత్రమే కాక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లు నిర్వహించే ప్రణాళిక ఉంది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడకు హబ్‌ లాంటిదే. దేశానికి అనేక బ్యాడ్మింటన్‌ ఛాంపియన్లను అందించిన ఘనత తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీకి దక్కింది అని చెప్పారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌ విజయవంతంగా సాగేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, గత రెండేళ్లలో అనేక మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించిన ఘనత సంస్థకు దక్కిందని తెలిపారు. పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌ నిర్వహణలో స్పోర్ట్స్‌ అథారిటీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయం అని అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ డాక్టర్‌ సోని బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్‌, డాక్టర్‌ రవితేజ, అనిత, సుజాత, పద్మావతి, స్పెషల్‌ ఆఫీసర్‌ బాషా, పిఆర్‌ఓ కాలేరు సురేష్‌, స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ కన్నం మధు, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రతినిధులు యువిఎన్‌ బాబు, వంశీధర్‌, లక్ష్మణ్‌, కె.శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page