- ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- బాచుపల్లిలో తెలుగు యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత ్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.35 కోట్లు వ్యయం చేశారు.
ఈ సందర్భంగా విశ్వ విద్యాలయం 39వ వ్యవస్థాపక దినో త్సవా లను సైతం మంత్రి శ్రీధర్ బాబు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. విశ్వ విద్యాలయ విద్యార్థులకు కం ప్యూటర్ల వినియోగంలో 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారు. కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు.
మన సంస్కృతి, సంప్రదా యాల వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతోనే తెలుగు విశ్వ విద్యా లయం ఏర్పాటు చేశారని చెప్పారు. పద్మభూషణ్ వరప్రసాద రెడ్డికి విశిష్ట . పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని మంత్రి శ్రీధర్ బాబు అంద జేశారు. కాగా, తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి వరప్రసాద రెడ్డి కోటి రూపాయల విరాళం అందించారు. విశ్వవిద్యాలయం విద్యార్థుల చిత్ర లేఖనం ప్రతిభను అమెరికా, మలేషియా దేశాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో చూశామని తెలిపారు. ఉప కులపతి నిత్యాన ందరావు నేతృత్వంలో తెలుగు విశ్వ విద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షి ంచారు.