7 ‌నుంచి సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌తెలంగాణ ను నెంబర్‌ ‌వన్‌ ‌క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్ ‌లో సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.  ఈమేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రీడోత్సవాలను విజయంతం చేసేందుకు ఈ నెల 7,8 తేదీల లోపు cmcup2024.telangana.gov.in వెబ్‌ ‌సైట్‌ ‌లో అన్‌ ‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ‌చేసుకోవాలని అధికారులు క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుని ప్రతిభను మదింపు చేసి, ప్రోత్సహిస్తారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి , వారిని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రథమంగా గ్రామ పంచాయతీ, మండల/మున్సిపాలిటీ, జిల్లా , రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

సబ్‌ ‌జూనియర్‌, ‌జూనియర్‌, ‌సీనియర్‌ ‌కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. ఎన్నడూ లేనివిధంగా సమాజంలో అందరూ భాగమనే భావనతో పారా క్రీడాకారులను కూడా సీఎం కప్‌ ‌లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 7,8 తేదీలలో గ్రామ పంచాయితీ స్థాయి పోటీలతో సీఎం కప్‌ – 2024 ‌క్రీడోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 10 నుంచి 12 వ తేదీ వరకు మండల / మున్సిపల్‌ ‌స్థాయిల్లో క్రీడా పోటీలు జరుగుతాయి. 16 నుంచి 21 వ తేదీ వరకు జిల్లా స్థాయిలోను, ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయి.

ప్రతి క్రీడాకారునుకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 36 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్రస్థాయి క్రీడల పోటీలను 7 చోట్ల నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ ‌తో పాటు కరీంనగర్‌, ‌హన్మకొండ, వరంగల్‌, ‌ఖమ్మం, మెదక్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లలో నిర్దేశించిన ఈవెంట్స్ ‌లో రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ కు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page