‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి

– కాంగ్రెస్ బీఎల్ఏలకు భట్టి ఆదేశం
– దిల్లీలో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29 : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ(సర్)ను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. దీనికి సంబంధించి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జ‌రిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ‘సర్’ పక్రియ, పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించామన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్‌పై జిల్లా ఇన్‌చార్జి, పార్టీ జిల్లా కమిటీలతో చర్చించి ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందని తెలిపారు. పౌరులుగా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని సూచించారు. బీఎలఏలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ‘సర్’పై సమీక్షించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 36 వేల మంది బీఎలఏలను నియమించినట్లు చెప్పారు. 50`60 శాతం ఈ పక్రియ పూర్తయిందని వెల్లడించారు. రెండుమÖడు రోజుల్లో 100 శాతం పూర్తవుతుందని వివరించారు. అర్హత గల ఓటర్ల ఓటు హక్కు కాపాడటం తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈసారి ‘సర్’ పక్రియ దురుద్దేశంతో జరుగుతున్నదని చెప్పారు. ఓట్లను కాపాడే ఉద్దేశంతో ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. సంస్థాగత బలోపేతం, పార్టీ ప్రభుత్వ సమన్వయంపై మాట్లాడామని మహేశ్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల అమలుపై సవిÖక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజ‌నర్సింహ, వంశీచంద్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *