మహిళా క్రీడల అభివృద్ధికి ముఖ్యమైన ముందడుగు

– క్రీడల శాఖ మంత్రి శ్రీహరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: హెచఎస్ బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రగ్బీ ఆట కోసం ఇక్కడికి విచ్చేసిన ఆటగాళ్లకు, కోచ్‌లకు, అధికారులకు, ఫ్రాంచైజీ యజమానులకు, భాగస్వాములకు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడానికి జి.ఎమ్.ఆర్ స్పోర్ట్స్ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆరు పురుషుల జట్లతోపాటు నాలుగు మహిళల జట్లు ఈ లీగ్‌లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు ఇది రగ్బీ ఆటకే కాక దేశంలో మహిళా క్రీడల అభివృద్ధికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాకారం చేయడానికి కలిసి పనిచేసిన జి.ఎమ్.ఆర్ స్పోర్ట్స్, రాహుల్ బోస్, రగ్బీ ఇండియా, ఫ్రాంచైజీ యజమానులు, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు, భాగస్వాములందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే, యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే, దేశ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ‘సాట్స’ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి, నిర్వాహకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *