పుణే మార్గంలో అనంతగిరి వద్ద స్టేషన్ ఉండాలి

– బుల్లెట్ రైలు, వరంగల్ ఎయిర్‌పోర్టుపై సీఎం సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని, అనంతగిరి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచఆర్ డి బోధి పెవిలియన్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్టుపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్వే లైన్ భారత్ ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ప్లాన్ చేయాలి. టూరిజం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే లైన్ ఉండాలి. హైదరాబాద్ (శంషాబాద్)బుల్లెట్ ట్రైన్ హబ్‌గా పిలవాలి. వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్‌లపైన ముఖ్యమంత్రి చర్చించారు. ఈ ఎయిర్‌పోర్టు కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద అడుగడుగునా ఉట్టిపడేలా ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టు ముందు భారీ ఐలాండ్ ఉండాలని, అందులో రాణి రుద్రమ, రుద్రదేవుడు విగ్రహాలతోపాటు భారీ నంది విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్స్‌పై దిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో చర్చలు జరపాలన్నారు. సమీక్షకు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీజీఐఐసీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *