– పోలీస్ శాఖ మానవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : ప్రమాద రహిత సమాజం కోసం పౌరులందరూ ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డియఫ్ వో సిర్ధార్ విక్రమ్ సింగ్ ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు ప్రజా ప్రతినిధులు నాయకులు వివిధ వర్గాల ప్రజలు సంయుక్తంగా వేగ నియంత్రణ వంటి నిబంధనలను పాటిస్తూ, సురక్షిత ప్రయాణం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమని, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం ప్రాణాంతకమని అధికారులు అవగాహన కల్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




