– స్కూల్లో కాల్పులకు తెగించిన సాయుధులు
– ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి
న్యూదిల్లీ,జూన్22: ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. టాక్లోబన్‌లోని శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు సాయుధులు అక్రమంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్రమైన బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో కొద్దికాలంగా అక్రమ ఆయుధాల చలామణి పెరిగిపోయింది. దీంతో ఇటీవల తుపాకీ సంబంధిత నేరాలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, పాఠశాలల్లో కాల్పులకు తెగబడటం చాలా అరుదైన ఘటనని స్థానిక డియా, అధికారులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 1,500మంది విద్యార్థులు ఉండగా.. కాల్పుల ఘటనతో పాఠశాల సిబ్బంది సహా వారంతా బయటకు పరుగులు తీశారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాడికి ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుల్లో ఒకరిని అదే పాఠశాలకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు దాడిలో గాయపడిన ఐదుగురిని సప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ మేరకు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



