– రూ. 2,000 చొప్పున 18,880 కోట్లు జమ
– హుగ్లీ జిల్లాలో విడుదల చేసిన ప్రధాని మోదీ
కోల్‌కతా, జూన్ 20: పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరింది. కేందప్రభుత్వం 2019లో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ.2 వేలు చొప్పున మొత్తంగా రూ.6వేలను రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. పీఎం కిసాన్ నిధులు పొందే వారి జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిఅందులో ’ఫార్మర్ కార్నర్’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో లబ్దిదారుల లిస్ట్‌పై క్లిక్ చేస్తే రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకుంటే లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇ-కేవైసీ చేయని వారికి నిధులు జమ కావు. కాబట్టి అదే పోర్టల్‌లో ఇ-కేవైసీ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



