శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం

– ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
– కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది ప్రభుత్వ హత్య అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద సమ్మె జరిగితే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 28వ పేజీలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండు పీఆర్‌సీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారంటూ ఆ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి చదివి వినిపించారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడితే ఓటు కాంగ్రెస్‌కు వేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధిస్తే ఎంత వస్తుంది.. ఆ డబ్బులు బఠానీలు కొనుక్కోవడానికి కూడా సరిపోవు.. ధిిల్లీకి పైసల మూటలు పంపడం ఆపితే కార్మికులకు డబ్బులు ఇవ్వొచ్చు అంటూ సర్కార్‌కు కేంద్ర మంత్రి చురకలంటించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టోను ప్రధాని మోదీని అడిగి తయారు చేశారా అంటూ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *