– ఈ బలిదానం తీవ్రంగా కలచివేసింది
– మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తీవ్రంగా కలిచివేసిందంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స’ వేదికగా మాజీ మంత్రి పోస్ట్ చేశారు. శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ’ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసింది.. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు తమ ఘన నివాళులు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత. ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన పక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలన్నారు. ఆర్టీసీ కార్మిక సోదరుల్లారా.. మీ పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం.. అధైర్యానికి లోనుకాకండి. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం.. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేస్తున్నాం.. జోహార్ శంకర్ గౌడ్’ అంటూ హరీ ష్ రావు పోస్ట్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




