శంకర్‌గౌడ్ మృతి అత్యంత బాధాకరం

– శవ రాజకీయం చేస్తున్న బండి సంజయ్
– మండిపడ్డ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శంకర్ మృతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయం చేస్తున్న తీరు హేయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే మరోవైపు బీజేపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం బండి సంజయ్ అని వ్యాఖ్యానించారు.  కేంద్ర మంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరికీ తెలుసన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆ కుటుంబం పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, చనిపోయిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని సర్కార్ ప్రకటించిందని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ మండిపడ్డారు. సీఎం, మంత్రివర్గం అంతా ఆర్టీసీ కార్మికులు తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారన్నారు. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఇలాంటి క్షుద్ర రాజకీయ పార్టీలను, నాయకులను నమ్మొద్దని, కార్మికులకు ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉంటుందని దయాకర్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *