– పోరాటం చేయాలే తప్ప ప్రాణాలు తీసుకోవద్దు
– ఎమ్మెల్యే కూనంనేని
– ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో మూడో రోజు ఉధృతంగా కొనసాగుతున్న సమ్మెలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు. కార్మికులు పట్టుదలతో తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడాలే కానీ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. అనంతరం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కార్మికుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ సమ్మెకు బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో మద్దతునిస్తుందని, తానే ముందుండి సమ్మెకు నాయకత్వం వహిస్తానని తెలిపారు. కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా సమ్మె నిర్వహించాలని కోరారు. కొత్తగూడెం మేయర్ మూడు గణెళిష్, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్, జై భీమ్ రావు పార్టీ రాష్ట్ర నాయకుడు యెర్ర కామేష్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపన్న నాయకులు మధు, సంజీవ్, సురేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీజేపీ నాయకులతోపాటు పలు పార్టీల కార్మిక సంఘాలకు చెందినవారు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు బి.ఎన్.రావు, నజీర్, భాస్కర్, సరస్వతి, రేణుక, రహంతుల్లా, సైదులు, శేషు, రాటి పాల్గొన్నారు. కాగా, మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళులర్పిస్తూ ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



