– రెండు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడి
టెహ్రాన్, జూలై 7: హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్పస్ గార్డస్ దాడులు చేసింది. రెండు నౌకలపై మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు నౌకలు దెబ్బ తిన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు డియాకు వెల్లడించారు. కాగా, మూడు వారాల క్రితం అమెరికా, ఇరాన్ దేశాలు మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిలో దాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ దాడులకు పాల్పడటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో ఘటనలో.. ఒమన్‌లోని లిమా తీరంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను పేలుడు వస్తువు బలంగా ఢీకొట్టింది. దీని కారణంగా ఆ నౌక ఎడమ వైపు భాగంలో భారీగా మంటలు చెలరేగాయి. బ్రిటీష్ మిలిటరీకి చెందిన ’యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





