మందుగుండు సామ‌గ్రి వివరాలు భద్రపరచండి

– సుప్రీం కోర్టులో పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగంపై విచారణ

న్యూదిల్లీ, జూలై 30 : జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరిగిన నిరసనల్లో దిల్లీ పోలీసులు పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగంపై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జనసమూహాన్ని నియంత్రించే సమయంలో పోలీసుల బలప్రయోగం ఎలా ఉండాలనే అంశంపై అమలులో ఉన్న గ్రేడెడ్‌ ‌యూజ్‌ ఆఫ్‌ ‌ఫోర్స్ ‌స్టాండింగ్‌ ఆర్డర్‌ను కోర్టు ముందు సమర్పించాలని ఆదేశించింది. వాడటానికి స్పష్టమైన రూల్స్ ఉం‌డాలని జస్టిస్‌ ‌బాగ్చీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పెల్లెట్‌ ‌గన్స్‌నూ పూర్తిగా నిషేధించలేమని చెప్పింది. మరోవైపు పిటిష‌నర్ల తరుపుణ న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల్లో నిరసనల సమయంలో మెటాలిక్‌ ‌పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగానికి అనుమతి లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అలాంటి ఆయుధాలు వాడకంపై పోలీసుల చర్యలపై విచారణ కోరారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, క్రౌడ్‌ ‌కంట్రోల్‌లో బలప్రయోగానికి సంబంధించిన అధికారికి స్టాండింగ్‌ ఆర్డర్‌ను రికార్డ్‌లో ఉంచాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్‌ ‌గన్స్ ‌వాడే అధికారం పోలీసులకు ఉందని చెప్పింది. ఇదే సమయంలో పోలీసులు వాడిన మందుగుండు సామాగ్రికి సంబంధించిన వివరాలు భద్రపరచాలని ఆదేశించింది. పెల్లెట్‌ ‌గన్స్ ‌కాల్పుల్లో గాయపడిన వారికి పూర్తి న్యాయ సహాయం అందించాలని లేడీ హార్డింగ్‌ ‌మెడికల్‌ ‌కాలేజ్‌ అం‌డ్‌ ‌హాస్పిటల్‌ను ఆదేశించింది. ఈ కేసు విచారణలో దిల్లీ పోలీసులు సమర్పించే స్టాండింగ్‌ ఆర్డర్‌, ‌పెల్లెట్‌ ‌గన్‌ ‌వినియోగంపై కోర్టు చేపట్టే పరిశీలన కీలకంగా మారే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *