పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

– దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం
– మంత్రి పొంగులేటి హామీ

భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర,జూలై 30 : పేదలకు ఇంటిచింత లేకుండా చేయాలనే ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విడతల వారీగా పేదలందరికి ఇంటికలను సాకారం చేస్తామని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని చండ్రుగొండ మండలం మంగయ్య బంజర గ్రామంలో రూ.45 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్‌, ‌లో లెవల్‌ ‌కాజ్‌వేను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీంతో రెండు దఫాలుగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదవారికి మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ‌నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. మూడు, నాలుగో విడతలో ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కులం, మతం, పార్టీ అని చూడటం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్న ఈ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *