సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతోపాటు కె.రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

 

సీఎం రేవంత్‌ను కలిసిన సీఎస్ జాజు

కాగా, రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *