సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..

‌ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్
‌వైద్య పరీక్షల కోసం తరలింపు

 యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ ‌క్రూ కాప్సూల్‌ ‌ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతాబుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వొచ్చారు. తొలుత సునీతాబుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్‌ ‌నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం స్ట్రెచర్లపై తరలించారు. ఐఎస్‌ఎస్‌లోని సూక్ష్మస్థాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడంసరిగా నిలబడలేక బ్యాలెన్స్ ‌కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ ‌ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక సునీతా విలియమ్స్ ‌ల్యాండింగ్‌కు సంబంధించి 2013లో వొచ్చిన హాలీవుడ్‌ ‌మూవీ గ్రావిటీ- సినిమాకు గుర్తుకుతెచ్చింది. 2013లో హాలీవుడ్‌ ‌నుంచి వొచ్చిన సైన్స్ ‌ఫిక్షన్‌ ‌చిత్రం గ్రావిటీ. ఈ సినిమాలో హాలీవుడ్‌ ‌హీరోయిన్‌ ‌సాండ్రా బుల్లక్‌ ‌కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్‌ ‌దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో సాండ్రా బుల్లక్‌ అం‌తరిక్షం నుంచి భుమికి ల్యాండ్‌ అయిన సన్నివేశం ప్రస్తుతం సునీత విలియమ్స్ ‌ల్యాండింగ్‌ను గుర్తుకుతెస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్‌ ‌స్పేస్‌ ‌సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా గమనిస్తారు. వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని నానా వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాకే కుటుంబ సభ్యులు వారిని కలుసుకునేందుకు అనుమతిస్తారు. ఇక అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను కూడా నాసా రికార్డు చేయనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లుఅనుభవాలు వంటివన్నీ తెలుసుకుని నాసా అధికారులు రికార్డు చేసుకుంటారు. చివరిగా వ్యోమగాములను తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇస్తారు. భూమ్మీదకు వొచ్చాక తాను ముందుగా కుటుంబసభ్యులతో పాటు పెంపుడు శునకాలను కూడా చూడాలనుకుంటున్నట్టు- సునీతా విలియమ్స్ ఇటీవల పేర్కొన్నారు. గతేడాది బోయింగ్‌ ‌స్టార్‌లైనర్‌ ‌వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలల పాటు- చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page