ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్‌వి మాటలే తప్ప చేతలు లేవు

  • అంచనా వ్యయాన్ని రూ. 200 కోట్లకు ఎందుకు పెంచారు?
  • ప్రభుత్వ పాఠశాలలను మూసేసే కుట్ర
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, మే 29 : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌పై సీఎం రేవంత్ రెడ్డివి మాట‌లే త‌ప్ప చేత‌లు లేవ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమ‌ర్శిచారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వ‌హించిన‌ ప్రెస్‌మీట్ లో సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి పాల్గొని మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు ఎంబిబీఎస్, ఐఐటీ, ఐఐఎంలలో మంచి ర్యాంకులు సాధించారని అన్నారు. వారికి బీఆర్ఎస్ తరపున స‌బితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో 6052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో ఐఐటీ, ఎంబీబీఎస్, ఐఐఎంలలో ర్యాంకులు సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ అసలు గురుకులాల గురించి ఏమీ చేయలేదని అబద్ధాలు మాట్లాడారు. కేసీఆర్ గురుకులాల ద్వారా విజయాలు సాధించిన విద్యార్థులే నిన్న రేవంత్ కార్యక్రమంలో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఓ క్రమపద్దతిలో చేసిన ప్రయత్నాల వల్లే గురుకులాలు మంచి ఫలితాలు సాధించాయి. ఎన్నో కొత్త గురుకుల కళాశాలలు కేసీఆర్ హయాంలో వొచ్చాయి. ప్రత్యేక శ్రద్దతో గురుకులాలు నడపడం వాళ్లే ఈ ఫలితాలు వొచ్చాయి.. రేవంత్ గొప్ప ఇందులో ఏమీ లేదు. రేవంత్ రెడ్డి తమ ఇంటి గ్రేటెడ్ రెసిడెన్టియల్ స్కూళ్లను ఓ పార్టీ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏనాడు వ్యతిరేకించలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్‌వి మాటలే తప్ప చేతలు లేవు. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. కేవలం బిల్డింగ్‌లు కడితే సరిపోతుందా? ఎదుటివాళ్ళ మీద సీఎం నిందలు వేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనా వ్యయాన్ని రూ. 80 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు ఎందుకు పెంచారు. ఏదో వేరే రాష్ట్రం ఏజెన్సీకి వాటిని అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. ఇంకా బిల్డింగ్‌లే పూర్తి కాలేద. అప్పుడే ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలను రేవంత్ మూసేసే కుట్ర చేస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై అసెంబ్లీలో ప్రశ్న అడిగితే సమాధానం లేదు. 2 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. గురుకులాల్లో పరిస్థితులను దారుణంగా మార్చేశారు. కేసీఆర్‌ను ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం తప్ప రేవంత్‌కు ఏదీ చేతకావడం లేదు. విద్యా కమిషన్ వేసి ఏడాది అవుతుంది. ఏ ఘనత సాధించారో చెప్పాలి. ఉద్యోగాల భర్తీపై రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రేవంత్ ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఫలితమే. విద్యా వ్యవస్థ కేసీఆర్ హయాంలో మెరుగుపడింది. గురుకులాల్లో నాణ్యత గల విద్య లభిస్తోందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ మూతపడ్డాయని ప్రచారం చేశారు.. వాటిలో ఎన్ని తెరిపించారో సీఎం చెప్పాలి .విద్యా శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డే ఉన్నారు. అయినా విద్యా శాఖలో గతంలో కన్నా అదనంగా చేసిన పనేమీ లేదని ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు.

సురభి వాణీ దేవి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేన‌ని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంచనాలు చూస్తే భయం అవుతుందని అన్నారు. స్కూల్స్‌లో వసతులు, టీచర్ల రిక్రూట్మెంట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మండల, జిల్లా పరిషత్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. విద్యా వ్యవస్థపై సమీక్షలు లేవు. నియోజకవర్గానికి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ సరిపోతుందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page