ప్రకృతి వైపరీత్యమై కాటేసినా
రుధిరాన్ని చెమటధారలుగా మార్చి
అధైర్యపడని నడకలతో
బీడుబడిన భూముల్లో
పచ్చని పైరులను పండించిన ఓ కృషీవలా
నీకు వందనాలు ఓ శ్రామిక జీవి
అర్ధరాత్రి అపరాత్రి అనక రోగమొచ్చినా నొప్పులొచ్చినా
చట్టమొచ్చినా పక్కమొచ్చినా
పచ్చని పైరు గొంతెండిన ప్రతిసారి గొంతు తడుపతూ
కోత కోసే సమయానికి అనుకోని అతిధిలా
వడగళ్లవాన వచ్చి చేతికి వచ్చిన పంటను
మింగేసినప్పుడు కన్నీళ్ళను కను రెప్పల మాటున
దాచుకొనిఉన్న నీకు వందనాలుఓ శ్రామిక జీవి
ఆరుగాలం కష్టించిపంటను కంటికి రెప్పలా కాపాడుకొని
పంటనంతా విపణికి తరలిస్తేఅధికారుల నిర్లక్ష్యంతో
లారీల కొరతగన్నీ సంచుల కొరత వల్ల
ధాన్యం కాంట అటకెక్కగా విషాదమంతా గుండెలో ఒంపుకుని
కన్నీళ్ళను కను రెప్పల మాటున దాచుకొని
నివ్వురుగప్పిన నిప్పులాంటి నీకు వందనాలుఓ శ్రామిక జీవి
పొలాల నడుమపురుగుబూషిల నడుమ
కాలం గడిపేస్తూ కష్టపడి తాను పస్తులు వుంటు
మనకు అన్నం ముద్ద నోట్లోకి అందిస్తున్న
నీకు వందనాలు ఓ శ్రామిక జీవి
ప్రకృతి వైపరీత్యమై కాటేసినామట్టినే నమ్ముకుని
తొలకరి జల్లుకై ఎదురుచూసే
ధైర్యానికి నీకు వందనాలు ఓ శ్రామిక జీవి
రైతే రాజుగా, రాజసంగా నిలవాలి
అలాంటి పరిస్థితులు మన కళ్ళముందే కదలాడాలి