– ఆగస్టు 3 వరకు ఓటర్ల నమోదు
– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రంలో ‘సర్’ నమోదు పక్రియను కేం ద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 9 వరకు అభ్యంత రా ల స్వీకరణ, అక్టోబర్ 12న తుది వోటరు. జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈనెల 24 వరకు ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3వ తేదీవరకు పొడిగించింది. అనేక జిల్లాలో సర్పై అవగాహన లేక మందకోడిగా కొన సాగుతుండగా గడువు సపిస్తుండడంతో అనేక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎన్యూమ రేషన్ ఫారాల స్వీకరణను పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు అందించాయి దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ గడువు పొడిగింపును ప్రకటించింది. అర్హత తేదీగా అక్టోబర్ 1వ తేదీ నాటికి వోటర్ల వివరాల సవరణను పరిగణనలోకి తీసుకుంటూ నూతన షె డ్యూల్ను ప్రకటించింది. ఈ నూతన షె డ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ‘సర్’ ఇంటింటి సర్వే పక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పనులను సైతం అధికారులు ఆగస్టు 3 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత 10న రాష్ట్రవ్యాప్తంగా వోటర్ల ముసాయిదా జాబితా అధికారికంగా విడుదల కానుంది. ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం, కొత్తగా వోటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, తప్పుల మార్పులు-చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజులపాటు గడువునిచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే ఈ అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తిస్థాయి పరిష్కార పక్రియను అధి కారులు ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పక్రి య అంతా ముగిసిన తర్వాత అన్ని సవరణ లతో కూడిన తుది ఓటర్ల జాబితాను అక్టో బర్ 12న ప్రకటించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





