– అండగా నిలిచిన సహోద్యోగులు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం జవాన్ అరే కిరణ్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. ఆ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.5.20 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓఎస్‌డీ వి.బి. కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా ఈ మొత్తాన్ని కిరణ్ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. బాధిత కుటుంబానికి తమ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన అన్ని సర్వీస్ ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము త్వరగా అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు అర్హులైన కుటుంబ సభ్యునికి కారుణ్య నియామకం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విరాళాల సేకరణను సమర్థంగా నిర్వహించిన ఆరఐ అడ్మిన్ శ్రీధర్ రెడ్డి, దినేష్‌రెడ్డి, కె.శ్రవణ్ కుమార్, కె.సుమన్, ఎస్.సాగర్‌తోపాటు సహకరించిన సిబ్బందిని ఓఎస్‌డీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ అడ్మిన్ జి.చక్రవర్తి, డిప్లాయ్‌మెంట్ ఎస్పీ సయ్యద్ బాషా, ఎస్పీ శ్రీనివాస్, ఎస్పీ రాంచందర్ రావు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొని కిరణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





