మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న రోడ్లు

– 334 ప్రాంతాల్లో దెబ్బ‌తిన్నాయి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30:‌మొంథా తుఫాను ప్రభావంతో ఆర్‌ అం‌డ్‌బీ రోడ్లు 334 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. త‌మ‌ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తుఫాన్‌ ప్ర‌భావంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించి మంత్రి మాట్లాడారు. నిన్న అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు..దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు రూ. 7కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్‌ ‌వల్ల అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. వరి ధాన్యం సుమారు 2లక్షల మెట్రిక్‌ ‌టన్నులు ఐకేపీ సెంటర్లో ఉంది.  ప్రభుత్వం రైతు పక్షపాతి అని.. తడిసిన ధాన్యాన్ని కూడా కొని వెంటనే మిల్లులకు తరలించేలా ముఖ్యమంత్రి, సివిల్‌ ‌సప్లై మినిస్టర్‌ ‌చొరవ చూపాల‌న్నారు.  పత్తి తేమ శాతానికి సంబంధించి ఇప్పటికే సీసీఐ ఛైర్మన్‌ ‌లలిత్‌ ‌కుమార్‌ ‌గుప్తాను ముంబై వెళ్లి మరి కలిసి రైతుల పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేశాను.. తేమ శాతంలో సడలింపులు ఇచ్చి తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలని కోరాను. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి కి రిక్వెస్ట్ ‌చేస్తున్నాం.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page