– పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్ పట్టుకొని ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదకర రీతిలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. గుడిమల్కాపూర్‌లో ఓ వ్యక్తి చిన్నారులను బైక్‌పై ప్రమాదకరంగా తీసుకెళ్తుండటంపై ‘ప్రమాదమని తెలిసీ ప్రాణాలతో చెలగాటం ఆడడటంపై ఆయన ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇలా బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు పట్టు తప్పితే బాధ్యలెవరని ప్రశ్నించారు. వర్షంలోనూ పిల్లల చదువుపై ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ రూల్స్ నేర్పించడంలో ఎందుకు ఉండడం లేదన్నారు. ఇలా ప్రమాదకర ప్రయాణం చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచించారు. ప్రజలంతా ఆలోచించాలని, ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఈ సందర్భంగా సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





