– వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో సత్యవతి రాథోడ్
వరంగల్, ప్రజాతంత్ర, మే 6: కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. రాబందు పాలన అని విమర్శించారు. రైతు కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. హనుమకొండలో బీఆరఎస్ రైతు సంగ్రామ సభలో ఆమె మాట్లాడుతూ రైతు బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం ఆగమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లలో వెయ్యిమంది రైతులు చనిపోయారని తెలిపారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ వరంగల్ అని, బీఆర్ఎస్ సభ పెడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతున్నదని అన్నారు. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెడితే అదే సమయానికి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారని,. కానీ రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్t అయ్యిందని విమర్శించారు. ఒక్క ఎకరానికి రైతు భరోసా వేసి అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులను పల్లా విమర్శించారు. వరంగల్ జిల్లాలో చివరి భూముల వరకు కేసీఆర్ నీళ్లిచ్చారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




