ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు
– కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. ఇవ్వాళ వాళ్లలో వాళ్లే తన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటార అని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని అన్నారు. ‘హరీష్‌, సంతోష్‌ వెనక రేవంత్‌ రెడ్డి ఉన్నారని ఒకరంటే లేదు లేదు కవిత వెనకాల రేవంత్‌ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు.. మీరంతా దిక్కుమాలినవారు.. తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. నేను నాయకుడిని. నా వాళ్లకు తోడుగా ఉంటా.. ఎవరైనా మీ వెనక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయతీలలోకి మమ్మల్ని లాగకండి’ అని అన్నారు. మీ పార్టీ కాలం చెల్లిన నోటు లాంటిది.. కాలగర్భంలో కలిసిపోతుంది.. ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *