– ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తే దానికే తిరిగి చెల్లింపు
– ఆ నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తులకు 10న ఆఖరు
– హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ క్యూర్ పరిథిలో నిర్మించనున్న ‘టవర్స’లో ఇండ్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు సమయంలో ధరావతు(ఈఎండీ)గా రూ.10వేలను స్వీకరించారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులతోపాటు ఈఎండీ మొత్తాన్ని కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే తీసుకున్నారు. ఈ ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తి అయినందున ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. దరఖాస్తుదారులు తాము ఏ అకౌంట్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించారో అదే అకౌంట్‌కు జమ చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని, వారంలోగా ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. అయితే కొందరు దరఖాస్తుదారులు తాము మీ సేవా కేంద్రాల్లో నగదు ద్వారా చెల్లించామని, లేదా ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇలా చెల్లించిన వారికి ఈ ధరావతు మొత్తం వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tస్త్రష్ట్రb.tవశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు జరిగిందో అదే అకౌంట్‌కు తిరిగి జమ అవుతుందని తెలిపారు.
కొనసాగుతున్న వెరిఫికేషన్
లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాల పరిశీలన కొనసాగుతున్నదని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని గౌతం తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు పత్రాలను(అలాట్‌మెంట్ లెటర్) అందచేస్తామన్నారు. ప్రతిపాదించిన 7,340 ఇండ్లకు వెయిటింగ్ లిస్టుతో కలిపి సుమారు పదివేల మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వెరిఫికేషన్ తరువాత లబ్దిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏ విధంగా, ఏ ఖాతాలో చెల్లించాలన్న దానిని అలాట్‌మెంట్ లెటర్‌లో పొందుపరుస్తామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియకు లాటరీలో ఎంపికైన వారు సహకరించాలని వైస్ చైర్మన్ కోరారు. ఈ ఇండ్లకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు కార్యాలయాలచుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వాట్సాప్/ఎసఎంఎస్ వంటి వాటి ద్వారా అవసరమైన సమాచారం అందిస్తున్నామని, ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్‌కు ఫోన్ 040I24603572) చేయవచ్చని సూచించారు.
నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తులకు 10వ తేదీ ఆఖరు
ఇందిరమ్మ టవర్స్ పథకంలో తొలుత 16 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేయగా మరో నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగు తున్నది. చాంద్రాయణగుట్ట, ఎల్.బి.నగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిథిలో నిర్మించనున్న టవర్స్‌లోని ఇండ్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఈ నెల 10 వరకు సమర్పించవచ్చనీ, ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌతం విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





