బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులపై చర్చకు సిద్దమే

– వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం
– ఇంత జరుగుతన్నా ఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు
– మండిపడ్డ మంత్రి జూపల్లి 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.74వేల కోట్ల అప్పు చేసిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. తాము అప్పులు చేయలేదని కేసీఆర్‌ ‌చెప్పాలి. నేను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కార్పొరేషన్‌ ‌పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టామని చెబుతున్నారు. అది నిజమా కాదా చెప్పాలన్నారు. ఇలా అప్పులు చేసి, ఎలా తీరుస్తారో ఎందుకు చెప్పలేదన్నారు. ఆ అప్పులను రైతుల నుంచి వసూలు చేస్తారా? ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తారా?మేం చేసిన ఆరోపణలపై కేసీఆర్‌ ఎం‌దుకు స్పందించడం లేదన్నారు.  నా వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇస్తా.. చర్చకు రావాలి. మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఇం‌కా బుకాయిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులను కేసీఆర్‌ ‌స్వయంగా మీడియాకు చెప్పాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని జూపల్లి అన్నారు. మరోవైపు అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయన కోసం కేటీఆర్‌ ‌వేచి చూస్తున్నారని అన్నారు. చర్చకు సవాల్‌ ‌విసిరిన మంత్రులు తోక ముడిచి పారిపోయారని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *