` హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
` పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీె
హౖదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలది దక్షిణం దిశగా వంగి ఉందని పేర్కొంది. బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో.. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో.. శుక్ర వారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరి సిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షా లు కొనసాగుతాయని వాతావరణశాఖ వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాల పల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.