– కేయూ వరంగల్ వీసీ ప్రతాప్‌రెడ్డి
– ఘనంగా ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్స్ ఫేజ్-1 ప్రారంభం
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: కిట్స్ వరంగల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్ ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ మెన్ (ఫేజ్-1) టోర్నమెంట్ ఓపెన్ డయిస్, ప్లే ఫీల్డ్స్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథి కేయూ వరంగల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కిట్స్ వరంగల్ సమాజ ప్రయోజనం కోసం క్రీడలు, ఆటలతోపాటు నాణ్యమైన సాంకేతిక విద్యను కొనసాగిస్తోందని, తగిన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోందని వివరించారు. ఆటలు శారీరక దారుఢ్యాన్ని కలిగించడమే కాక కలలను సాకారం చేసుకోవడంలో మానసిక సమతుల్యతను పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలు, ఆటలు జాతీయ సమగ్రతను, విద్యార్థి సమాజంలో సోదర భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పారు. ఆటలో ఓడిపోతే ఆటగాళ్ళు నిరాశ చెందక తమ లోపాలను సరిదిద్దుకుంటే క్రీడా స్ఫూర్తి, మెరుగైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాలకు వీలవుతుందన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ వై.వెంకయ్య మాట్లాడుతూ క్రీడలు, ఆటలు విద్య సమయంలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన సాధనాలని అన్నారు. ప్రతీ విద్యార్థి భారత దేశ ఆరోగ్యకరమైన పౌరుడిగా మారడానికి శారీరక వ్యాయామం చాలా అవసరమని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలో అవకాశాలను పొందవచ్చన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంతర్-వ్యక్తిగత నైపుణ్యాలను కూడా మెరుగుపరచగలరని అన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ కిట్స్ వరంగల్‌లో ఇంజనీరింగ్ విద్యలో భాగంగా క్రీడలు, ఆటలు ఉన్నాయని, కేయూ వరంగల్ పరిధిలోని ఆదిలాబాద్, ఖమ్మం వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల 31 కళాశాలల నుండి 750 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. రెండు రోజులలో ఆరు రకాల ఆటలు టేబుల్ టెన్నిస్ (ఱ) షటిల్ బ్యాడ్మింటన్ చెస్ వంటి ఇండోర్ గేమ్‌లు (ఱఱ) అవుట్‌డోర్ గేమ్స్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వాలీబాల్ నిర్వహిస్తారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ (డబ్ల్యు) అదనపు కార్యదర్శి వోడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ శారీరక విద్య అనేది విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని కాపాడే ప్రధాన అంశాలలో ఒకటన్నారు. ఇది అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో అంతర్భాగం కూడా. కిట్స్ వరంగల్ అందించే ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ అండ్ టెన్నిస్ వంటి బహిరంగ ఆటలకు ఉపయోగపడే 25 ఎకరాల ఆట స్థలాలు, ఇండోర్ స్టేడియం, వ్యాయామశాల వంటి క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకుని జాతీయ స్థాయి క్రీడాకారులు కావాలని అన్నారు. గెలిచినా, ఓడినా క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. ఈ వేడుకలో ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ ఇ.నారాయణ, కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, డాక్టర్ ఏటిబి టి.ప్రసాద్, అన్ని విభాగాల ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, కిట్స్‌డబ్ల్యు ఫిజికల్ డైరెక్టర్లు వెంకటస్వామి, మహేష్, నాగరాజు, డీన్‌లు, హెడ్‌లు, అధ్యాపకులు, సిబ్బంది, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, 750 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





