యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద తమ సిబ్బందితో సైబర్ క్రైం, డిజిటల్ అరెస్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీసీ కెమెరాల విశిష్టతను, చైన్ స్నాచింగ్ గురించి కూడా ప్రజలకు అవగాహన కలిగించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నేరాలగురించి అవగాహన సదస్సు నిర్వహించి వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ యువకులు, విద్యార్థులు డ్రగ్స్ బారినపడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి అని 112 టోల్‌ఫ్రీ నెంబర్ కాల్ చేయాలంటూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





