స్తంభించిన ప్రజా రవాణా

– మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
– డిపోలకే పరిమితమైన 10 వేల బస్సులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: తెలం గాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అ న్ని జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం చే శారు. దాదాపు 10 వేల బస్సులను నిలిపి వేసిన కార్మికులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లు లేక సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారు. కరీంనగర్ పరిధిలోని డిపోల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం అధికారులు అద్దె ఎలక్ట్రిక్ బస్సులను నడిపి స్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కామారెడ్డి డిపో ముందు భారీగా పోలీసులు మోహ రించారు. పోలీసుల పహారా నడుమ అద్దె బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా చేశారు. బీఆర్డీయూ, బీఆర్ఎ సి నాయకులు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. గోదావరిఖని, హుస్నాబాద్, నిజామాబాద్ వంటి పలు జిల్లాల్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమ్మె చురుకుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. 

జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అద్దె బస్సులు పాక్షికంగా నడిచినా, ప్రయాణికులకు ఇబ్బం దులు తప్పడం లేదు. పలు ప్రాంతాలలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేటు బస్సులను ఆర్టీసీ అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడిపించారు. జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు తమ మద్దతును ప్రకటిం చారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు పెంచడంతో పలుచోట్ల వాహనదారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోవడంతో మహిళలు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇబ్బం దులు పడ్డారు. తమ డిమాండ్లపై హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *