నిరసనలను విజయవంతం చేయండి

– మంత్రి సీతక్క పిలుపు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమాల్లో కార్మికులు, కర్షకులు, కూలీలు, సర్పంచులు, ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల శక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఒక ప్రకటనలో ఆమె పిలుపునిచ్చారు. పల్లెల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం వందరోజుల పాటు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉరివేస్తోందని సీతక్క ఆరోపించారు. లోక్‌స‌భలో పూర్తిస్థాయి చేర్చలేకుండా హడావుడిగా బిల్లును పాస్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీల్లో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఉపాధి పొందుతున్నారని, వారి ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంద‌ని మండిపడ్డారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, కూలీల ఉపాధి హక్కును కాపాడుకునేందుకు కలసి కట్టుగా పోరాడుతామని, రాజకీయాలకతీతంగా అందరూ ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page