పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ‌పోస్ట్‌మార్టమ్‌

-16 ‌మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ‌తదితరులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇటీవలి ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ ‌నిర్వహించారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ల‌పై రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లగొండలో ఎమ్మెల్యేల్లో సమన్వయ లోపం కనిపించిందని భావించారు. రెబల్స్‌తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుబట్టారు. పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 31 జిల్లాల్లోని 12,733 సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్‌ ‌విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్‌, బీజేపీ 688 స్థానాలు పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. అయితే తమకు పట్టున్న కొన్నిచోట్ల స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈక్రమంలోనే దానికి బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page