మానుకోట పేరు మహబూబాబాద్ గా రూపాంతరం చెందేందుకు మనవారు నవాబుల పాలన గుర్తుచేస్తూ పేరు మారిన విషయాన్ని చెబుతూ వస్తారు. నాటి మానుకోట నేటి మహబూబాబాద్ పోరాటాల గడ్డగా కమ్యూనిస్టుల అడ్డగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడుతూ వస్తున్న క్రమంలో నేడు రాష్ట్ర శాసనసభలో పెట్టిన బిల్లు ద్వారా ఆ భూములు మాయమై పరుల పాలు కావటం 2014 తర్వాత ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో రికార్థుల రూపం మారుతూ కనుమరుగైన భూలలను వెలుగులోకి తెచ్చే అవకాలు ఉన్నవి. మానుకోట మహబూబాబాద్ గా రూపాంతరం చెందిన సమయంలోనే నవాబులు వ్యాపార కేంద్రంగా ఉన్న మానుకోట లో భూములు అధికంగా ఉంచుకున్నారు. నవాబుల పాలన కనుమరుగైన తరువాత ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా నమోదుచేసి ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంది.
వీటిలో కొంత భాగం కమ్యూనిస్టు పార్టీలు భూమి లేని నిరుపేదల కోసం ఇండ్ల స్థలాల పోరాటంతో కాలనీలను నిర్మించడం జరిగినది. మరి కొంత భూమిలో సామాజిక వర్గాల నాయకత్వంలో కాలనీలు వెలిసినవి. అయినప్పటికీ మహబూబాబాద్ లోని విలువైన భూములు సరిహద్దులు మర్చి సర్వే నెంబర్లు మర్చి ప్రజా ప్రతినిధులు వారి పేరున, వారి కుటుంబ సభ్యుల పేరున వారికి నమ్మకమైన వ్యక్తుల పేరున ధరిణిలో నమోదు చేసుకొని తమ ఆధీనంలో ఉన్న వాటికి శాసనసభలో ప్రవేశపెట్టిన చట్టం ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వరంగల్ ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా పనిచేసిన వాకటి కర్ణ గారు, 2012-13 సంవత్సరములు మహబూబాబాద్, గుమ్మనూరు, అనంతరం, బేతోలు, శనిగపురం, ఇదులపూసపల్లి గ్రామాల సరిహద్దులను, ప్రభుత్వ భూములను సర్వే చేయించి పూర్తి నివేదికలను మహబూబాబాద్ ఆర్డిఓ కార్యాలయం తో పాటు నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిలువ చేసిన విషయం తెలిసినదే.
నాటి సర్వే వివరాలు సంబంధిత కార్యాలయంలో పొందుపరిచినప్పటికీ ప్రభుత్వాలు మారటం ప్రజాప్రతినిధులు కొత్తవారు రావడం భూములపై ఆశలు పెరగటం భూములను స్వాధీనం చేసుకోవాలని దురాశ తోడు కావడంతో వారి అనుసనులలో ఉన్న అధికారుల నిర్వాకం వలన నేటి ప్రభుత్వ భూములు ప్రైవేటు పట్టా భూములుగా మారి నాటి ప్రజా ప్రతినిధుల చేతుల్లో వారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్నదనేది జగమెరిగిన సత్యం. నేడు గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు భూభారతి చట్టాన్ని శాసనసభలో ప్రవేశ పెట్టడం అందులో సభ దృష్టికి తీసుకు వచ్చిన వాటిలో అనేకము మహబాబాదుకు సంబంధించినవి ఉన్నవి. అంతే కాదు మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం పేరును ప్రత్యేకంగా చెబుతూ నాటి ఎంపీటీసీ పేరును కూడా శాసనసభ రికార్డుల్లోకి వెళ్లే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడటం కూడా అందులో భూమి వివాదాల పట్ల స్పష్టమైన అవగాహనతోనే ఈ చట్టాన్ని తీసుకురావడం ఒక కోణం అయితే…. నాటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న వాటిని బయటికి తీయాలి అనేది రెండవ కోణం. ప్రజలు రెవెన్యూ పరమైన వివాదల నుంచు వారి భూములు వారుకి చెందే విధమైన నిర్ణయం తీసుకోవడం ప్రధానమైన కోణం.
నేడు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీన పరచుకున్న వారి నుండి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. ట్రస్టుల పేరున ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం. శనిగపురం, బేతోలు, అనంతారం రెవెన్యూ శివారులోని భూములుగా చూపుతూ మహబూబాద్,(గుమ్మునూరు) పట్టణానికి చెందిన భూములను స్వాధీనం చేసుకున్న దానిపై కూడా ఈ చట్టం ప్రకారం బయటికి తీసే అవకాశాలు ఉన్నవి. పట్టణంలో అత్యంత ఖరీదైన భూమి కోర్టు సముదాయాల వెనుక రైల్వే ట్రాక్ పక్కకు ఉన్న మాతృక భూమి కూడా మాయం కావడం రెవెన్యూ అధికారుల తీరు సర్వేయర్ల స్వార్ధ విధానాలకు నేడు మాతృక భూమి కనుమరుగైన దానిని కూడా వెలుగు తీసుకువచ్చే అవకాశాలు చట్టంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదిఏమైనా మహబూబాద్ రెవెన్యూ గ్రామానికి చెందిన భూములు మాయమైన వాటిపై స్పష్టంగా బయటికి తీసే అవకాశాలు చట్టంలో కనిపిస్తున్నది. బయటికి తీస్తారా బయటికి తీయరా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది.
గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్
సీనియర్ జర్నలిస్ట్