– నిరవధిక సమ్మెకు బీజేపీ మద్దతు
– పార్టీ అధికార ప్రతినిధి సుభాష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్ 3 నుండి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును ఆయన నివాసంలో గురువారం కలిసి మద్దతు కోరారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, రూ.900 కోట్లు బకాయిలను తక్షణమే చెల్లించాలని రాంచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. సుమారు నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నిలిపివేయడం వల్ల విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిరదని ఆయన తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారని, విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన చర్చల మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మెను విరమించాయని, దసరా, దీపావళి లోపు చెల్లిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోకపోవడంతో మరోసారి సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిరదని సుభాష్ తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోందని ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





