– ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని, ఆయన గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజులుగా బోరబండలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి బి-టీమ్‌గా బీఆర్‌ఎస్ పనిచేస్తున్నదంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. మంత్రి సీతక్క ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకుంటామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె మూడు రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నామని చెప్పారు. తమ ప్రచారానికి మంచి ప్రజాస్పందన వస్తోందన్నారు. ఈ స్పందన చూస్తుంటే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని అన్నారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్చుకోలేక బీిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, అబద్దాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి ఓటమి తథ్యం అని సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





