నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటన
న్యూదిల్లీ,జూన్14: ప్రధానమం
అనంతరం కెనడాకు మోదీ బయలుదేరి వెళ్తారు. కెనడా ప్రధాని మార్క్ కార్నే ఆహ్వానం మేరకు జూన్ 16-17 తేదీల్లో జరిగే జీ–7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జీ–7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి. సదస్సు సందర్భంగా పలు దైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధాని పాల్గొంటారు. ప్రధాని తన పర్యటన చివర్లో క్రొయేషియాలో పర్యటిస్తారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్ ఆహ్వానం మేరకు జూన్ 18న ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. క్రొయేషియాలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు పర్యటించనుండటం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాని పర్యటన ఒక మైలురాయి కానుంది. ప్రధాని ప్లెంకోవిక్, అధ్యక్షుడు జోరన్ మిలనోవిక్‌తో మోదీ సమావేశమవుతారు. యూరోపియన్ యూనియన్ భాగస్వాములతో మరింత పటిష్ట బంధాల గురించి చర్చిస్తారు.