– గత కొంతకాలంగా జలుబుతో ఇబ్బంది పడుతున్న బీఆర్ ఎస్ అధినేత
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్14
గతంలో యశోదా హాస్పిటల్‌కి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు. అయితే ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లారు. నిన్న సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని ఆయన నివాసం నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్, ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లి వైద్యులను సంప్రదించారు. మళ్లీ ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు నేడు హాస్పిటల్ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. అందుబాటులో ఉండాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోనే ఉండనున్నారు.
ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈనెల 11న మాజీ సీఎం హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా తనకు జలుబు ఉందని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌కు చెప్పారు. ఓపెన్ కోర్టులో విచారణ వద్దని కేసీఆర్ కోరగా ఆయన వినతిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను రద్దు చేశారు. ఇండోర్‌లోనే కేసీఆర్‌ను కమిషన్ ముఖాముఖిగా విచారించింది. ఇక అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో కేసీఆర్ బాధపడు తున్నారు. ఈ క్రమంలో వైద్యపరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు