– ప్రభుత్వ రాయితీ పొందిన హాస్పిటల్స్‌కు సుప్రీం హెచ్చరిక
న్యూదిల్లీ, మే 20: ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్థికంగా బలహీన వర్గాలకు తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో రోగులకు ఉచిత చికిత్స అమలు విషయంలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 51 హాస్పిటల్స్‌లో కేవలం నాలుగు హాస్పిటల్సే నిబంధనలు పాటిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ తమ ఇన్‌పేషెంట్ విభాగంలో 10 శాతం, అవుట్ పేషెంట్ విభాగంలో 25 శాతం వరకు ఉచిత చికిత్స అందించడం తప్పనిసరని మరోసారి స్పష్టం చేసింది. 2018లో ఇచ్చిన తీర్పును సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన రూపొందించాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించినట్లు తేలిన 51 హాస్పిటల్స్‌ల్లో మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, వేంకటేశ్వర, మూల్ చంద్ హాస్పిటల్స్ ఉన్నాయి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలిన వాటిపై గతంలో ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడైంది. ఈ అంశంపై దిల్లీ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మూల్‌చంద్ ఖైరతీ రామ్ ట్రస్ట్ కేసులో జస్టిస్ ప్రశ్రాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





