వివాదాస్పదంగా త్రిభాషా విధానం

– సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

న్యూదిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ స్‌ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇప్ప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తరఫున దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారాన్నిప్రధాన న్యాయర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా తొమ్మిదో తరగతి నుంచి మూడు భాషలను తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక, విద్యాపరమైన భారం పడుతుందని ఆయన కోర్టుకు వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉందని, దీనివల్ల అటు విద్యార్థుల్లో, ఇటు విద్యాసంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలని రోహత్గి ధర్మాసనాన్ని అభ్యర్థించారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు సీబీఎస్‌ఈ విద్యా చట్రంలో మార్పులు చేస్తూ 9, 10 తరగతుల్లో విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలను అందులో రెండు భారతీయ భాషలను చదవాలనే నిబంధనను తీసుకు వచ్చింది. అయితే, తగిన ముందస్తు ప్రణాళిక లేకుండా, విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిబంధనను రుద్దడం సమంజసం కాదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ వాదనలను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వచ్చే వారం సమగ్ర విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *