న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్2: రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఏన్డీయే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. గొప్ప సంస్క•తి, కష్టపడి పనిచేసే ప్రజలతో తెలంగాణ ప్రకాశిస్తోందని షా అన్నారు. తెలుగు రాష్టాల్రు వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రజలకు
ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
