తిరువనంతపురం,అక్టోబర్22: కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ప్రమదం ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం హెలిప్యాడ్ కాంక్రీట్‌లో కూరుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను సరిచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





