రూ. 6000 తగ్గిన బంగారం ధర

– అంతర్జాతీయ పరిణామాలతో తగ్గుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఒక్క రోజులోనే ఆరు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం రూ.1, 27, 200కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 16, 600కి చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్స్ (31.10 ‌గ్రాములు) ధర తగ్గడం వల్లే బంగారం ధరల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఔన్స్ 24 ‌క్యారెట్ల బంగారం ధరం ఏకంగా 245 డాలర్లు క్షీణించింది. 4097 డాలర్లకు దిగి వచ్చింది. మరోవైపు వెండి కూడా ఔన్స్ ‌ధర 3.9 డాలర్లు తగ్గి 48.39 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి ధరలు కిలోకు దాదాపు రూ.2 వేలు తగ్గి రూ.1.80 లక్షలకు చేరుకున్నాయి. 2013 తర్వాత ఈ రెండు లోహాలు ఒక్క రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. ఈ రెండు లోహాలు గరిష్టాలకు చేరువు కావడం, అంతర్జాతీయంగా డాలర్‌ ‌తిరిగి బలోపేతం కావడం, పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడడం అంతర్జాతీయ విపణిలో బంగారం ధర పతనానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.  మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.6 వేలు తగ్గింది. ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్‌ ‌బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్‌ ‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మరోవైపు విజయవాడలో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,200కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,600కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,62,000కు చేరుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page