‘టెట్’ను వాయిదా వేయాలి

– డీటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 3నుండి నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)  రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు  డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు శనివారం లేఖ పంపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు పూర్తిగా నిమగ్నమయ్యారని, కొందరు ఉపాధ్యాయులు మూడు దశల ఎన్నికల విధులను కూడా నిర్వర్తించారని  తెలిపారు. ఎన్నికల విధుల కారణంగా టెట్ కు సరైన రీతిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉపాధ్యాయులకు లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ జనవరి 3 నుండి టెట్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉపాధ్యాయ వర్గాన్ని ఆందోళనకు గురిచేసిందన్నారు. ఎన్నికల విధులు ముగిసిన వెంటనే పరీక్ష నిర్వహించడం అన్యాయమని, ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి కలిగిస్తుందని డీటీఎఫ్ అభిప్రాయపడింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెట్ను కొన్ని రోజులపాటు వాయిదా వేసి ఉపాధ్యాయులకు సముచితంగా సిద్ధమయ్యే అవకాశం కల్పించాలని డీటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరింది.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page