డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు

– ఎంపిక చేసిన మ‌నం ఫౌండేష‌న్‌

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః అనురాగ్‌ హెల్పింగ్ సొసైటీ చైర్‌ప‌ర్స‌న్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, వరల్డ్వైజ్క‌న్సూమ‌ర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్‌ డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ -2025 అవార్డు లభించింది, అత్యధిక సామాజిక కార్యక్రమాలు, ప్రపంచ శాంతి కోసం, దేశభక్తి నిపెంపొందించే ఎన్నో కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ పథ‌కాలు, చట్టాలు అమలులో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటే కలిగే లాభాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించడం, ముఖ్యంగా అనాధ పిల్లలకు, దివ్యాంగులకు అమ్మ ప్రేమని అందిస్తూ వారిని సొంత ఖ‌ర్చులతో చదివిస్తూ వారి బాగోగులు చూస్తూ,  దివ్యాంగులను, అనాధ పిల్లలను వృద్దులను, మహిళలను ఆదరిస్తుండడం, వారి అభివృద్ధికి సహకరించి చేయూతనిస్తుండడంతో ఆమె అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డు, సర్టిఫికెట్‌కు ఎంపిక చేశామని మనం పౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి తెలిపారు. డాక్టర్ అనితా రెడ్డి సేవలు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు ల‌భించినందుకు సంతోషంగా ఉందని, పీఎం మోదీ పేరిట అవార్డు ను ఊహించలేదని చాలా ఆనందంగా ఉందని, మరింత బాధ్యత పెంచిందని, ఇక ముందు కూడా సమాజహితం కోసం సేవా కార్యక్రమాలు  మరిన్ని చేపడతానని తెలిపారు. త‌మ‌సేవా కార్యక్రమాలలో ఆర్బాటాలకు, అట్టహాసాలకు స్ధానం ఉండదని, స్వచ్ఛమైన సేవలే అవసరార్ధులకు అందిస్తామని అందుకే ఇంత గుర్తింపు లభించిందని అనితా రెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page