బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత!

ప్రధాని షేక్‌ హసీనా  ఈ ఏడాది జుల్కెలో  అధికారం నుంచి వైదొలిగిన నాటి నుంచి బంగ్లాదేశ్‌ లోని హిందూ మైనార్టీలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హసీనాను దించివేసే క్రమంలో మొదల్కెన అల్లర్లు, దారుణాలు పెరుగుతున్నాయే కానీ తగ్గ లేదు. హిందువులు లక్ష్యంగా ఈ అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ ఆ దేశంలో మైనారిటీల దుస్థితికి తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం గళం విప్పే దాస్‌ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ దేశద్రోహ నేరం మోపారు. ఆయనను అరెస్ట్‌ చేసి, బెయిలివ్వకుండా కస్టడీకి పంపారు. అంతేకాదు, అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం(ఇస్కాన్‌)పై నిషేధం విధించనున్నట్టు బంగ్లా సర్కార్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని అటార్నీ జనరల్‌(ఏజీ) వెల్లడిరచారు. ప్రభుత్వం ఇస్కాన్‌ ని మత సంస్థగా పేర్కొంది. చిన్మయ్‌ అరెస్టు నేపథ్యంలో ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇస్లాం అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం ఎప్పుడో మానేసింది. అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్‌’ను ర్యాడికల్‌, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్‌ అభివర్ణించడం ఆందోళనకరం. ఆధ్యాత్మిక చ్కెతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం బుద్ధిలేని పని. మరోవైపు, చిన్మయ్‌ అరెస్టును భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు పాకిస్థాన్‌ను తలపిస్తోందని అధికార బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోభారత్‌పై వ్యతిరేక ప్రచారాన్ని పెంచే కార్యక్రమం నడుస్తోంది. తీవ్రవాద శక్తులను ప్రోత్సహించడం వంటివి బంగ్లాదేశ్‌ను పూర్తి అరాచక రాజ్యంగా మారుస్తున్నాయన్నారు. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చర్యలే ఇందుకు కారణమని చెప్పాలి. హిందూ, బౌద్ధ దేవాలయాలపై దాడులు తరచూ జరుగుతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

షేక్‌ హసీనా రాజీనామా అనంతరం.. గతంలో నిషేధానికి గురైన ‘బంగ్లాదేశ్‌ జమాతే ఇస్లావిరీ’ వంటి తీవ్రవాద సంస్థలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఈ తీరును చూస్తుంటే మైనార్టీ వ్యతిరేక భావజాలం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత ఏర్పడిరది.  అదే సమయంలో తీవ్రవాద సంస్థలు మళ్లీ రెచ్చిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీటిలో విదేశీ జోక్యం ఉందనే వారి వాదనను కొట్టిపారేయలేము. ఢాకాలోని పాక్‌ రాయబార సంస్థ ముందు చోటుచేసుకుంటున్న కార్యకలాపాలు ఇందుకు ఉదాహరణ. కొన్ని తీవ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌ సన్నిహితంగా మెలుగుతోందనేది బహిరంగ రహస్యం. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే కుట్ర దీని వెనక ఉన్నట్టు  కనిపిస్తోంది.  ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లావిరీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్‌ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ)లు యూనస్‌ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్‌ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు,  పార్లమెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది.

మరోవైపు, జూల్కె నాటి ప్రజా ఉద్యమంతో ఆప్గనిస్తాన్‌ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు… యావత్‌ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా ? పసిఫిక్‌ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ది పొందాలని అమెరికా భావించింది. హసీనా సర్కార్‌ అందుకు ఒప్పుకోకపోవటంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో  ట్రంప్‌ గెలవడం బంగ్లాకు చెడు పరిణాయం. మధ్యంతర సర్కార్‌ సారథి ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనస్‌ కు ట్రంప్‌ ద్వేషి గా పేరుంది. ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారనే వాదన కూడా ఉంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతానికి పడిపోయారనే వాస్తవం అక్కడ జరుగుతుందో చెప్పకనే చెబుతోంది. ప్రాణ భయంతో బతుకుతున్నఅక్కడి హిందువులను కాపాడేందుకు భారత ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిం చాల్సివుంది. కేవలం మాటలకు పరిమితం కాకుండా చేయగలిగినదంతా చేయాలి. యూనస్‌ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి.
  -చరణ్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *