– సంచలన తీర్పు వెల్లడించిన పోక్సో న్యాయస్థానం
– నిందితునికి శిక్షతో గ్రామస్తుల హర్షం
చిట్యాల (నల్లగొండ జిల్లా) ప్రజాతంత్ర సెప్టెంబర్ 15; మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో దోషికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2018 ఫిబ్రవరి 1న చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. సదరు బాలిక టీవి చూస్తుండగా బెదిరించి, లైంగిక దాడి చేశాడని, ఈ ఘటనపై బాధితురాలి తండ్రి చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన పోలీసులు 2018 ఫిబ్రవరి 11న పోక్సో యాక్ట్ 2012 కింద రాములుపై కేసు నమోదు చేశారు. ఎనిమిది ఏండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం పోక్సో న్యాయస్థానం ఈనెల 15న తీర్పు వెలువరించింద.ఇ ఈ కేసులో నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.30వేల జరిమానా విదించారు. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు ఈ కేసులో ఐవోలుగా కె.భాస్కర్ రెడ్డి, డి.సైదులు బాబు, కె.పాండు రంగారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకంగా వ్యవహరించారు. ఈ తీర్పుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




